APNationalTELANGANA

తెలుగు రాష్ట్రాలనుంచి అయోధ్యకు ప్రత్యేక రైళ్లు..

తెలుగు రాష్ట్రాల నుంచి అయోధ్య సందర్శనకు వెళ్లే భక్తుల కోసం ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ నెల 29 నుంచి ఫిబ్రవరి 28 వరకు మొత్తంగా 60 రైళ్లు నడుస్తాయని.. వీటిలో 15 హైదరాబాద్ నుంచే ఉంటాయని అన్నారు. అయితే విశ్వహిందూ పరిషత్, భజరంగ్ దళ్, తదితర ధార్మిక సంస్థల ద్వారా మాత్రమే బుకింగ్ సేవలు లభిస్తాయని చెప్పారు. హైదరాబాద్- అయోధ్య ప్రయాణ ఛార్జీ (స్లీపర్) రూ.1500 ఉంటుందని పేర్కొన్నారు.