Uncategorized

ఏలూరు పడమర వీధిలో ఉన్న గంగానమ్మ పాఠశాలలో ఫంక్షన్

ఏలూరు పడమర వీధిలో ఉన్న గంగానమ్మ పాఠశాలలో గురువారం ఓ ప్రైవేటు ఫంక్షన్ జరిగింది. పిల్లలు ఆడుకునే స్థలాన్ని ఓ ప్రజా ప్రతినిధి చెప్పారు అనే సాకుతో ఆ పాఠశాల ఉపాధ్యాయులు ఇచ్చారు. దానికి గాను వారికి తగిన పారిపోషకం పుట్టినట్లు తెలిసింది. ఈ విషయంపై వారిని ప్రశ్నిస్తే మాకు ప్రజా ప్రతినిధులు నుంచి ఫోన్ వచ్చిందని దాని వాళ్లే పిల్లలు స్కూల్లో ఉన్న టైంలో కూడా ఇచ్చామని చెబుతున్నారు. నిబంధనల ప్రకారం ప్రభుత్వ పాఠశాలలో పిల్లలు చదువుకునే సమయాల్లో ఎటువంటి వేడుకలు జరగకూడదని చెప్తున్నాయి. ఈ విషయం కూడా తెలియకుండా ఉపాధ్యాయులు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించడం కేవలం కొందరు ప్రజాప్రతినిధులు చెప్పారని సాగుతూ వ్యవహరించడం సరికాదు అని పలువురు విమర్శిస్తున్నారు.