AP

ప్యాపిలి మండలం గార్లదిన్నె లో ఇంటింటికి బిజెపి ఒబిసి కార్యక్రమం

 

నంద్యాల జిల్లా డోన్ నియోజక వర్గం ప్యాపిలి మండలం గార్లదిన్నెలో రాష్ట్ర బిజెపి ఆదేశాలతో ఓబీసీ మోర్చా బిజెపి జిల్లా కార్యదర్శి తవిశెట్టి రమేష్ ఆధ్వర్యంలో చేపట్టిన గ్రామ గ్రామానికి, ఇంటింటికి ఓ బి సి కార్యక్రమం,ఈ సందర్భంగా బిజెపి ఓబీసీ మోర్చా నంద్యాల జిల్లా బిజెపి కార్యదర్శి గార్లదిన్నె తవిశెట్టి రమేష్ మాట్లాడుతూ బిజెపి అధిష్టానం ఆదేశాలతో ప్యాపిలి మండలం గార్లదిన్నె గ్రామంలో ఇంటింటికి ఓబీసీ కార్యక్రమం చేపట్టి ప్రజల సమస్యలు తెలుసుకుని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారం దిశగా అడుగులు వేస్తున్నామని, ముఖ్యంగా ప్యాపిలి మండలంలో చాలా మందికి రైతు భరోసా అందడం లేదని దీనిపై ప్రభుత్వం వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా మండలంలో చాలా మంది వితంతు,వృద్ధాప్య,ం టరి మహిళలకు పెన్షన్లు సరిగా అందడం లేదని,కొందరికి అసలే తీసి వేశారని,ప్రజలకు అండగా ఉంటామని భరోసా ఇచ్చి అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం అర్హులైన ప్రతి ఒక్కరికి రైతు భరోసా,వితంతు, వృద్ధాప్య,ఒంటరి మహిళల పింఛన్లు మంజూరు చేసి సకాలంలో వారికి అందించాలని డిమాండ్ చేస్తూ ఈ విషయంలో బిజెపి ఎప్పటికీ ప్రజల పక్షాన పోరాడు తుందని భరోసా ఇచ్చిన నంద్యాల జిల్లా ఓబీసీ బీజేపీ జిల్లా కార్యదర్శి గార్లదిన్నె తవిశెట్టి రమేష్, ఈ కార్యక్రమంలో ఇంకా ఫ్యామిలీ మండల, గార్లదిన్నె బిజెపి నాయకులు పాల్గొన్నారు.