కవిత మధ్యంతర బెయిల్ పై కోర్టు కీలక నిర్ణయం..!
ఎమ్మెల్సీ కవితకు మరో షాక్ తగిలింది. కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్‌పై ఢిల్లీలో రౌస్ అవెన్యూ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. కవిత మధ్యంతర బెయిల్ పిటీషన్ ను తిరస్కరించింది. కవితకు బెయిల్ ఇవ్వొద్దని కోర్టును కోరిన ఈడీ.. బెయిల్ ఇస్తే సాక్షాలను ప్రభావితం చేస్తారంటూ వాదనలు వినిపించింది. మార్చి 26 నుంచి తిహార్ జైల్‌లో ఉన్నారు. రేపటితో కవిత జ్యూడీషియల్ రిమాండ్ పూర్తి కానుంది. దీంతో, కవిత నెక్స్ట్ స్టెప్ పైన ఆసక్తి కొనసాగుతోంది. …

