అవినీతి, కమీషన్లు: బీఆర్ఎస్ సర్కారుపై విరుచుకుపడిన జేపీ నడ్డా
హైదరాబాద్: కుటుంబ పార్టీలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా (JP Nadda). ప్రాంతీయ పార్టీల్లో ఎప్పుడూ వారి వారసులే పదవుల్లో ఉంటారని.. వారసులను పదవుల్లో కూర్చోబెట్టడం గురించే ఆలోచిస్తుంటారని అన్నారు. చేవెళ్లలో జరిగిన బీజేపీ బహిరంగ సభలో పాల్గొన్న జేపీ నడ్డా.. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలపై విమర్శలు గుప్పించారు. దేశం గురించి, ప్రజల గురించి ప్రాంతీయ పార్టీలు ఆలోచించవని జేపీ నడ్డా అన్నారు. ఈ తొమ్మిదేళ్ల కాలంలో కేసీఆర్ ప్రజల సొమ్మును దోచుకున్నారని…

