చంద్రబాబుకు స్కిన్ అలర్జీ- రాజమండ్రి జైల్లో పరీక్షలు..!
స్కిల్ స్కాంలో అరెస్ట్ అయి రాజమండ్రి జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబుకు స్కిన్ అలర్జీ సోకినట్లు తెలుస్తోంది. తీవ్రమైన ఎండ వేడిమి, ఉక్కపోత కారణంగా చంద్రబాబుకు అలర్జీ సోకినట్లు సమాచారం. కొన్ని రోజులుగా ఎండ వేడిమి కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న చంద్రబాబుకు స్కిన్ అలర్జీ సోకినట్లు రాజమండ్రి జైలు అధికారులు ప్రభుత్వ ఆస్పత్రి డాక్టర్లకు సమాచారం ఇవ్వడంతో వారు పరీక్షలు నిర్వహిస్తున్నారు. రాజమండ్రి జైలుకు చంద్రబాబు వచ్చి 33 రోజులు పూర్తయింది. ఈ…

