మళ్ళీ టిఫిన్ బదులు చద్దెన్నం తినే రోజులు
చద్దెన్నం చద్దెన్నం తింటే మంచిదని, ఆరోగ్యం అని పెద్దలు చిన్నతనంలో పొద్దుటే మనకి తినడానికి పెట్టినప్పుడు ఏడుపొచ్చేది. దానిలోకి ఆవకాయో, మాగాయో, తొక్కు పచ్చడో కలిపి ముద్దలు చేసి పెడితే తినేవాళ్ళం. కొందరిళ్ళల్లో అన్నం బదులు ఉదయం టిఫిన్లు తినేవారు. అలాంటి సంఘటనలు చూసినప్పుడు, మాకూ కావాలని పిల్లలం పేచీ పెడితే, సముదాయించినంత సేపు సముదాయించి, వీపు విమానం మోత మోగించేవారు. హైస్కూల్ అయ్యేంత వరకూ దాదాపు అన్ని ఇళ్ళల్లోనూ ఇదే తంతు. ఉత్తప్పుడు ఎంత మారాం…

