ఆస్కార్ వేడుకల్లో ఇండియన్ గా రెడ్ కార్పెట్ మీద నడుస్తా —:ఎన్టీఆర్
ఆస్కార్ వేడుకలకు ఇంకో రెండు రోజులు మాత్రమే సమయం ఉంది. ప్రస్తుతం ఇండియా మొత్తం ఆస్కార్, ఆర్ఆర్ఆర్ అంటూ జపం చేస్తుంది. ఒక్కసారి ఆస్కార్ కనుక ఇండియా అందుకుంది అంటే ఇండియన్ సినిమా రేంజ్ ఎక్కడికో వెళ్ళిపోతోంది. అందుకే ఈ అవార్డు కోసం ప్రతి ఇండియన్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇక ఆర్ఆర్ఆర్ చిత్ర బృందం ఇప్పటికే అమెరికా చేరుకొని ప్రమోషన్స్ మొదలుపెట్టేసారు. మొదట వెళ్లిన చరణ్ కొన్ని ఇంటర్వ్యూలు కవర్ చేయగా.. ఈ మధ్యనే వెళ్లిన తారక్…