Editor

AP

కేంద్రంలో బీజేపీ రావాలని ఏపీ ప్రజలు కోరుకుంటోన్నారు: మోదీ..

రాష్ట్రంలో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన వేళ.. ప్రతిపక్ష తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ కూటమికి తొలి బహిరంగ సభను నిర్వహిస్తోంది. పల్నాడు జిల్లాలోని చిలకలూరిపేటలో ఈ సభ ఏర్పాటైంది. దీనికి ప్రజాగళం అని పేరు పెట్టారు.   ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్.. వేదికను పంచుకున్నారు. సుదీర్ఘ విరామం అనంతరం ఒకే వేదికపై ఈ ముగ్గురూ కనిపించారు. 2014 నాటి సార్వత్రిక ఎన్నికల…

AP

మోడీ వచ్చింది అందుకే.. ప్రజాగళం సభలో పవన్ కళ్యాణ్ ..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీయే ప్రభుత్వాన్ని స్థాపించబోతున్నామని జనసేన పార్టీ అధినేత పవన్‌ కళ్యాణ్‌ (Pawan Kalyan) అన్నారు. టీడపీ, జనసేన, బీజేపీ ఆధ్వర్యంలో బొప్పూడిలో ఏర్పాటు చేసిన ప్రజాగళం బహిరంగ సభకు ప్రధాని నరేంద్ర మోడీ ముఖ్యఅతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా పవన్‌ కళ్యాణ్ మాట్లాడారు.   అభివృద్ధిలేక అప్పులతో నలిగిపోతున్న ఆంధ్రప్రదేశ్‌ ప్రజానీకానికి ప్రధాని నరేంద్ర మోడీ రాక బలాన్నిచ్చిందని పవన్ కళ్యాణ్ అన్నారు. ఎన్డీయే (NDA) పునర్‌ కలయిక ఐదు కోట్ల మందికి ఆనందాన్ని…

National

7 విడతల్లో సార్వత్రిక ఎన్నికలు.. ఏపీలో మే 13న పోలింగ్..

దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల నగారా మోగింది. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఎన్నికల షెడ్యూల్ ను ఈసీ విడుదల చేసింది. ఢిల్లీలో విజ్ఞాన్ భవన్ ప్లీనర్ హాల్ కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్, ఎన్నికల కమిషనర్లు సుఖ్ బీర్ సింగ్, జ్ఞానేశ్ కుమార్ ఎన్నికల షెడ్యూల్ ను ప్రకటించారు.   రాజీవ్ కుమార్ ఎన్నికల తేదీలను ప్రకటించారు.. దేశంలో 97 కోట్ల ఓటర్లు ఉన్నారని తెలిపారు. 55 లక్షల ఈవీఎంలు సిద్ధం చేశామన్నారు.…

TELANGANA

ఎమ్మెల్సీ కవితే ప్రధాన కుట్రదారు..–:ఈడీ..

లిక్కర్ కుంభకోణంలో ఎమ్మెల్సీ కవిత ప్రధాన కుట్రదారుగా ఉన్నట్లు ఈడీ పేర్కొంది. కవిత ఆప్ ముఖ్య నేతలతో కలిసి మాగుంట శ్రీనివాసులు రెడ్డి, మాగుంట రాఘవ, శరత్ చంద్రా సౌత్ గ్రూపును నడిపించారని ఈడీ వివరించింది. మద్యం పాలసీ ద్వారా డబ్బులు రాబట్టడానికి రూ.100 కోట్లు ముడుపులు చెల్లించినట్లు గుర్తించామని తెలిపింది. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, మనీశ్ సిసోడియాతో కవిత ఒప్పందం కుదుర్చుకున్నట్లు విచారణలో తేలినట్లు పేర్కొంది.   కవిత సౌత్ గ్రూప్ సభ్యులతో కలిసి పలువురు…

TELANGANA

తెలంగాణలో 17 స్థానాల పోలింగ్, కౌంటింగ్ ముహూర్తం ఖరారు..!!

దేశ వ్యాప్తంగా ఎన్నికల నగారా మోగింది. తెలంగాణలోని 17 ఎంపీ స్థానాలకు ఒకే విడతలో పోలింగ్ జరనుంది. ఏడు విడతల్లో పోలింగ్ ప్రక్రియ కొనసాగనుంది. అందులో భాగంగా నాలుగో విడతలో తెలంగాణలోని 17 ఎంపీ స్థానాలకు పోలింగ్ ముహూర్తం ఖరారైంది. ఏపీలో లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికలతో పాటుగానే తెలంగాణలో పోలింగ్ నిర్వహణకు ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఈ మేరకు షెడ్యూల్ ఖరారు చేసింది. దీంతో, వెంటనే కోడ్ అమల్లోకి వచ్చింది.   తెలంగాణలోకి 17 ఎంపీ…

AP

ఎన్నికల షెడ్యూల్ వేళ సంచలనం… టీడీపీలోకి వైసీపీ ఎంపీ..

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఒంగోలు లోక్ సభ సభ్యుడు మాగుంట శ్రీనివాసులరెడ్డి, ఆయన కుమారుడు రాఘవరెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో చంద్రబాబు మాగంటకు కుండువా కప్పి ఆహ్వానించారు.   వీరితోపాటు అద్దంకి నియోజకవర్గానికి చెందిన బాచిన చెంచు గురటయ్య, బాచిన కృష్ణచైతన్య, ఉమ్మడి నెల్లూరు జిల్లా కావలి మాజీ ఎమ్మెల్యే వంటేరు వేణుగోపాల్ రెడ్డి కూడా టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. మాగుంట శ్రీనివాసులరెడ్డి రాకతో ప్రకాశం జిల్లా…

AP

ఏపీ ఎన్నికల షెడ్యూల్ విడుదల..

ఏపీలో ఎన్నికల సమరానికి ముహూర్తం ఖరారైంది. ఏపీలోని 25 ఎంపీ, 175 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికల సంఘం తేదీలు ప్రకటించింది. ఏపీలో ఒకే విడతలో అన్ని స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. షెడ్యూల్ ప్రకటనతో వెంటనే కోడ్ అమల్లోకి రానుంది. ఇప్పటికే రాజకీయ పార్టీలు ఎన్నికల కోసం వ్యూహాలతో సిద్దం అవుతున్నాయి. ఇప్పుడు షెడ్యూల్ ప్రకటనతో ఏపీలో అసెంబ్లీ సమరం మొదలైంది. పోలింగ్, కౌంటింగ్ తేదీలను ఎన్నికల సంఘం వెల్లడించింది.   ఏపీలో పోలింగ్ ఇలా సార్వత్రిక ఎన్నికల…

National

పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపు..

సార్వత్రిక ఎన్నికల(Lok Sabha election 2024)కు ముందు కేంద్ర ప్రభుత్వం వాహనదారులకు గుడ్‌న్యూస్ చెప్పింది. దేశ వ్యాప్తంగా అధిక ఇంధన ధరలతో అవస్థలు పడుతున్న వాహనదారులకు ఉపశమనం కలిగించే ప్రకటన చేసింది. పెట్రోల్, డీజిల్‌పై లీటర్‌కు రూ. 2 చొప్పున తగ్గిస్తున్నట్లు గురువారం రాత్రి వెల్లడించింది.   చమురు మార్కెటింగ్ కంపెనీలు సవరించిన ఈ ధరలు శుక్రవారం ఉదయం 6 గంటల నుంచి అమలులోకి వస్తాయని కేంద్ర చమురు మంత్రిత్వ శాఖ తెలిపింది. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు…

TELANGANA

తెలంగాణలో టెట్ నోటిఫికేషన్ విడుదల..

తెలంగాణలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష(TET) నోటిఫికేషన్ విడుదలైంది. మే 20 నుంచి జూన్ 3 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. మార్చి 27 నుంచి ఏప్రిల్ 10 వరకు అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవచ్చని విద్యాశాఖ సూచించింది. కాగా, టెట్ నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిన కొద్ది సేపటికే టెట్ నోటిఫికేషన్ రావడం గమనార్హం.   అంతకుముందు ఉపాధ్యాయ అర్హత పరీక్ష నిర్వహణకు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. డీఎస్సీకి ముందే టెట్ నిర్వహించాలని నిర్ణయించింది.…

TELANGANA

మల్కాజిగిరి, ఆదిలాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులను ప్రకటించిన కేసీఆర్..

వచ్చే లోక్‌సభ ఎన్నికలకు భారత రాష్ట్ర సమితి(BRS) మరో ఇద్దరు అభ్యర్థులను ప్రకటించింది. మల్కాజ్‌గిరి నుంచి లక్ష్మారెడ్డి, ఆదిలాబాద్‌ అభ్యర్థిగా ఆత్రం సక్కు పేర్లను బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు గురువారం ఖరారు చేశారు. రాష్ట్రంలోని 17 స్థానాలకు ఇప్పటి వరకు బీఆర్‌ఎస్‌ 11 మంది అభ్యర్థులను ప్రకటించింది.   సామాజిక సమీకరణాలను దృష్టిలో పెట్టుకొని, పార్టీ ముఖ్యనేతలు, క్షేత్రస్థాయిలో అభిప్రాయాలు సేకరించి, అందరి ఏకాభిప్రాయంతో పార్టీ అధినేత కేసీఆర్‌ అభ్యర్థులను ప్రకటించారు. కాగా,…