World

NationalWorld

భారత్ తో మరింతగా సంబంధాలు మెరుగుపురుచుకునేందుకు రష్యా కొత్త ఫారిన్ పాలసీ..

రష్యా తన మిత్రదేశాలు, దానికి సంబంధించిన విదేశాంగ విధానంపై ఇటీవల ప్రకటన జారీ చేసింది, తన మిత్ర దేశాలైన చైనా, భారత్ తో మరింతగా సంబంధాలు మెరుగుపురుచుకునేందుకు రష్యా కొత్తగా ఫారిన్ పాలసీని ప్రవేశపెట్టింది. ఉక్రెయిన్ యుద్ధ నేపథ్యంలో తన మిత్రదేశాల ఏవో, శతృదేశాలేవనే దాని గురించి చెప్పకనే చెప్పింది. ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభం అయినప్పటి నుంచి అమెరికా, యూరోపియన్ దేశాలు రష్యాను శతృవుగా చూస్తుండటంతో కొత్త విదేశాంగ విధానం ద్వారా రష్యా మరింత బలోపేతం అయ్యేందుకు…

NationalWorld

భూటాన్ రాజు జిగ్మే ఖేసర్ నామ్‌గేల్ వాంగ్‌చుక్‌తో ప్రధాని నరేంద్ర మోడీ భేటీ…

భూటాన్ రాజు జిగ్మే ఖేసర్ నామ్‌గేల్ వాంగ్‌చుక్‌తో ప్రధాని నరేంద్ర మోడీ  చర్చలు జరిపారు. ఆర్థిక సహకారంతో సహా అనేక రంగాలలో ద్వైపాక్షిక నిశ్చితార్థాన్ని పెంపొందించే మార్గాలపై దృష్టి సారించారు. ద్వైపాక్షిక సంబంధాలను విస్తరించే మార్గాలపై ప్రధాని మోదీ, కింగ్ వాంగ్‌చుక్ మధ్య చర్చలు జరిగినట్లు తెలిసింది. భారత పర్యటన కోసం భూటాన్‌ రాజు జిగ్మే ఖేసర్‌ నాంగ్యల్‌ వాంగ్‌చుక్‌ సోమవారం ఢిల్లీ చేరుకున్నారు. ఆయనకు విమానాశ్రయంలో విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్‌.జైశంకర్‌ స్వాగతం పలికారు. అనంతరం…

APNationalTechnologyTELANGANAWorld

యూపీఏ చార్జీల మీద వివరణ..

యూపీఏ చార్జీల మీద వివరణ ఇచ్చింది నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పీసీఏ). యూపీఏ వినియోగదారుల మీద ఎలాంటి భారం ఉండదని స్పష్టం చేసింది. ఏప్రిల్ 1 నుంచి కొత్త చార్జీలు అమల్లోకి రానున్నాయి. ప్రస్తుతం వ్యాపార సంస్థలే చార్జీలు చెల్లిస్తాయని స్పష్టం చేసింది. నియోగదారులకు తక్షణం ఎటువంటి చార్జీలు ఉండవని కేంద్రం వివరణ ఇచ్చింది. UPI చెల్లింపులపై ఛార్జీలు విధిస్తున్నట్లు మీడియాలో వచ్చిన వార్తలను ఎన్‌పీసీఏ ఖండించింది. యూపీఐ ద్వారా బ్యాంకు ఖాతా నుంచి…

CINEMAUncategorizedWorld

ఆస్కార్ వేడుకల్లో ఇండియన్ గా రెడ్ కార్పెట్ మీద నడుస్తా —:ఎన్టీఆర్

ఆస్కార్ వేడుకలకు ఇంకో రెండు రోజులు మాత్రమే సమయం ఉంది. ప్రస్తుతం ఇండియా మొత్తం ఆస్కార్, ఆర్ఆర్ఆర్ అంటూ జపం చేస్తుంది. ఒక్కసారి ఆస్కార్ కనుక ఇండియా అందుకుంది అంటే ఇండియన్ సినిమా రేంజ్ ఎక్కడికో వెళ్ళిపోతోంది. అందుకే ఈ అవార్డు కోసం ప్రతి ఇండియన్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇక ఆర్ఆర్ఆర్ చిత్ర బృందం ఇప్పటికే అమెరికా చేరుకొని ప్రమోషన్స్ మొదలుపెట్టేసారు. మొదట వెళ్లిన చరణ్ కొన్ని ఇంటర్వ్యూలు కవర్ చేయగా.. ఈ మధ్యనే వెళ్లిన తారక్…

World

యుద్ధమంటే ఇంత భీకరంగా ..?

అది ఒకప్పుడు సుందరమైన పర్యాటక ప్రదేశం. సాల్ట్‌ అండ్‌ జిప్సమ్‌ గనులు ఆ ప్రాంతంలో కొకొల్లలు. ఇప్పుడు అది సర్వనాశనమైంది. ఒకప్పుడు జీవకళతో కళకళలాడిన నగరంలో ఇప్పుడు ప్రేతకళ తాండవిస్తోంది. చూద్దామన్నా మనుషులు కనిపించని పరిస్థితి. ఎక్కడా చూసినా బాంబుల మోత, బుల్లెట్ల వర్షమే. యుద్ధం ఆ ఊరి రూపాన్నే మార్చేసింది. ఆ నగరాన్ని కైవసం చేసుకుంటే శత్రుదేశంపై యుద్ధంలో గెలిచినట్టే. ఉక్రెయిన్‌లోని బాక్‌ముఠ్‌ నగరం.. రష్యాతో యుద్ధంలో కకావికలమైన. రష్యా సరిహద్దు నుంచి 100 కిలోమీటర్ల…

NationalWorld

ఆర్థిక నేరాలకు పాల్పడి దేశం విడిచి పారిపోయిన నేరస్తులను తిరిగి స్వదేశానికి శీఘ్రగతిన అప్పగించేందుకు బహుముఖ చర్యలు తీసుకోవాలని జి 20 దేశాలను భారత్‌..

ఆర్థిక నేరాలకు పాల్పడి దేశం విడిచి పారిపోయిన నేరస్తులను తిరిగి స్వదేశానికి శీఘ్రగతిన అప్పగించేందుకు బహుముఖ చర్యలు తీసుకోవాలని జి 20 దేశాలను భారత్‌ కోరింది. ఆర్థిక నేరస్తులను అప్పగించడమే కాదు, వారి నుండి దేశ విదేశాల్లో ఆస్తుల రికవరీ కూడా జరిగేలా చూడాల్సి వుందని కోరింది. దేశ రాజధాని శివార్లలోని గుర్‌గావ్‌లో అవినీతి నిరోధక వర్కింగ్‌ గ్రూపు మొదటి సమావేశం బుధవారం జరిగింది. ఈ సమావేశానికి ఇటలీ ప్రతినిధితో కలిసి కేంద్ర సహాయ మంత్రి జితేంద్ర…

World

టర్కీలో మళ్లీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై 5.6గా నమోదు

టర్కీలో మరోసారి భూకంపం సంభవించింది. మలాట్యా ప్రావిన్స్‌లోని యెసిల్యర్ట్ పట్టణంలో సోమవారం భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.6గా నమోదైంది.   పలు భవనాల కింద ఎవరైనా చిక్కుకుని ఉండొచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. ఒక బిల్డింగ్ కూలడంతో, ఆ శిథిలాల కింద తండ్రీ, కూతురు చిక్కుకున్నట్లు అధికారులు తెలిపారు. ఈ శిథిలాల నుంచి వారిని రక్షించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. యెసిల్యర్ట్ పట్టణంలో అనేక బిల్డింగ్స్ కూలిపోయాయని, ఆ నగర…

World

రష్యా-ఉక్రెయిన్ మధ్య రోజుల తరబడి హోరాహోరీగా యుద్ధం

వాషింగ్టన్: రష్యా-ఉక్రెయిన్ మధ్య రోజుల తరబడి హోరాహోరీగా యుద్ధం కొనసాగుతోంది. ఈ నెల 24వ తేదీతో ఈ యుద్ధానికి ఏడాది పూర్తయింది. ఇన్ని రోజులుగా నిరాటంకంగా ఈ రెండు దేశాలు తలపడుతూనే వస్తోన్నాయి. నువ్వా-నేనా అన్నట్లు సాగుతున్న ఈ పోరులో ఉక్రెయిన్‌లోని పలు నగరాలు ధ్వంసం అయ్యాయి. వందలాదిమంది ప్రాణాలు కోల్పోయారు. అదే స్థాయిలో ఆస్తినష్టం సంభవించింది. అయినప్పటికీ ఏ దేశం కూడా వెనక్కి తగ్గట్లేదు. ఉక్రెయిన్ పై యుద్ధానికి దిగిన రష్యాను పాశ్చాత్య దేశాలన్నీ బహిష్కరించాయి.…

World

భారత్ పై కూడా ఆంక్షలు విధించాలి: ఉక్రెయిన్

రష్యా, ఉక్రెయిన్ యుద్ధం (Russia Ukraine war) ప్రారంభమై సంవత్సరం పూర్తి కావొస్తోంది. యుద్ధం ఇప్పట్లో ముగిసే సూచనలు కూడా కనిపించడం లేదు. యుద్ధ (Russia Ukraine war) ప్రభావం ప్రపంచ దేశాల ఎకానమీ (world economy)పై తీవ్రంగా పడుతోంది. అమెరికా, యూరోప్ (europe) దేశాల సహకారంతో ఉక్రెయిన్ రష్యాను దీటుగా ఎదుర్కొంటోంది. Ukraine wants sanctions against India: ఇండియా పైనా ఆంక్షలు ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ ఎంపీ ఒలెక్సాండ్ మెరెజో (Oleksandr Merezhko) ఆ…

World

పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తాజాగా తీసుకున్న నిర్ణయం ప్రపంచ వ్యాప్తంగా చర్చ

పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తాజాగా తీసుకున్న నిర్ణయం ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశమయ్యింది. త్వరలో జరగబోతున్న జాతీయ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో ఇమ్రాన్ ఒక్కడే 33 స్థానాల నుండి పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నాడు. ఆయన పార్టీ కోర్ కమిటీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. గత సంవత్సరం ఏప్రిల్ నెలలో జరిగిన విశ్వాస పరీక్షలో ఇమ్రాన్ ఖాన్ ఓటమి పాలవడంతో తన పార్టీ ఎంపీల అందరిని రాజీనామా చేయించాడు. ఇప్పుడు ఆ స్థానాలకు ఉప…